తెలుగులో చాలామంది కమెడియన్స్‌ హీరోలుగా మారుతున్నారు. నెలకో కామెడీ హీరో బరిలో దిగుతున్నాడు. కానీ వీళ్లలో 10 శాతం మంది కూడా ప్రామినెంట్‌ కామెడీ స్టార్ నిరూపించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా జనాలని థియేటర్లకి రప్పించడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ స్టోరీతో బాక్సాఫీస్‌ని మెప్పించే వాళ్లు కూడా కనిపించడం లేదు.

కామెడీ హీరోస్‌లో ఉన్న వ్యాక్యూమ్‌ని వాడుకోవాలని చాలామంది కమెడియన్స్‌ ట్రై చేశారు. సునీల్‌ అయితే హీరోగా నిలబడ్డానికి ఆరేళ్లపాటు పోరాటం చేశాడు. అయితే ఈ ప్రయత్నాల్లో 'మర్యాదరామన్న, పూలరంగడు' తప్ప మిగతా సినిమాలన్నీ బోల్తాపడ్డాయి. దీంతో సునీల్‌ కామెడీ హీరో ట్రాక్‌ నుంచి పక్కకువచ్చి, మళ్లీ సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తున్నాడు. హీరో కమ్‌ కమెడియన్ కమ్ విలన్‌గా కెరీర్‌ని ముందుకుతీసుకెళ్తున్నాడు.

కమెడియన్‌ నుంచి హీరోలుగా మారిన సప్తగిరి, షకలక శంకర్ లాంటి వాళ్లు బాక్సాఫీస్‌ దగ్గర నిలబడట్లేదు. ఈ హీరోల సినిమాకి వెళ్తే నవ్వులు గ్యారెంటీ అనే మార్కెట్‌ సంపాదించుకోలేదు. ఇక రియాలిటీ షోస్‌తో కమెడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకుని, హీరోగా మారిన సుడిగాలి సుధీర్‌ లాంటి వాళ్లు కూడా ఫెయిల్ అవుతున్నారు. రీసెంట్‌గా వచ్చిన కామెడీ హీరోస్‌లో నవీన్‌ పోలిశెట్టి మాత్రమే హోప్స్ పెంచుతున్నాడు. హీరోగా ఫస్ట్ మూవీ 'ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ'తో తన మార్క్ చూపించిన నవీన్, 'జాతిరత్నాలు'తో భారీ హిట్‌ కొట్టాడు. యూనిక్‌ కామెడీ టైమింగ్‌తో సెపరేట్‌ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీంతో ఈ హీరోకి బడా బ్యానర్ల నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ హాస్యంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో ప్రేక్షకులకు ఫేవరెట్‌ కామెడీ స్టార్ అయ్యాడు. సేమ్‌ టు సేమ్ సీనియర్ నరేష్‌ కూడా కామెడీ మూవీస్‌తో ప్రేక్షకులని ఎంటర్‌టైన్‌ చేసేవాడు. అయితే వీళ్లు వయసు పెరిగి సపోర్టింగ్‌ రోల్స్‌లోకి వచ్చాక, ప్రామినెంట్ కామెడీ హీరోస్‌ కూడా కరువయ్యారు. రాజేంద్రప్రసాద్, సీనియర్‌ నరేష్‌ నెమ్మదించాక అల్లరి నరేష్‌ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ కామెడీ మూవీస్‌తో సూపర్ హిట్లు అందుకున్నాడు. అలాగే తక్కువ సమయంలోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. బాక్సాఫీస్‌ దగ్గర మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకున్నాడు. కానీ అల్లరి నరేష్‌ ఈ మధ్య కొంచెం డిఫరెంట్‌గా ఉండే సినిమాలకే ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు.  అల్లరి నరేష్‌ వేరియేషన్ స్టార్‌ అనిపించుకోవాలని, కంప్లీట్‌ యాక్టర్‌ని చూపించాలని సీరియస్‌ సబ్జెక్ట్స్‌కీ సైన్ చేస్తున్నాడు. మహేశ్‌ బాబు 'మహర్షి'లో సెంటిమెంటల్‌ క్యారెక్టర్ ప్లే చేస్తే, 'నాంది'తో సీరియస్ సబ్జెక్ట్‌ని డీల్ చేశాడు. మున్ముందు కూడా నరేష్ ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేస్తాడనే ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: