తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది. కొత్తగా హీరోయిన్లుగా సినిమాల లోకి రావాలని అనుకుంటే మాత్రం ముందుగా మూడు కమిట్మెంట్ లు ఇవ్వాలని అంటున్నారు. అవి సినిమాలకు సంబందించిన కమిట్మెంట్లు కావడం ఆసక్థి గా మారింది. మరో విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ల కు కూడా ఇదే తంతు కొనసాగుతుంది.. అసలు ఆ మూడు కమిట్మెంట్ లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఒక్క సినిమాలో ఛాన్స్ రావాలంటే.. మూడు సినిమాల్లో చేస్తామని ముందుగానే కమిట్‌మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. వారికి ఇష్టం లేకపోయినా.. కష్టం అయినా కూడా ఇలా తప్పక చేయని పరిస్థితులు ఉన్నాయి. స్టార్ హీరో నో లేదా స్టార్ దర్శకుడో ఓ హీరోయిన్‌కు ఛాన్స్ ఇస్తామంటున్నారు. అయితే వాళ్ళ తో ఒక్క సినిమా కాదు.. మూడు సినిమాలు వరుసగా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. అలా అగ్రిమెంట్ ఉంటేనే సినిమా అవకాశం ఇస్తున్నారు లేదంటే వదిలెస్తున్నారు. ఇదో సేఫ్ డీల్‌గా కూడా దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారు.


త్రివిక్రమ్ ఒకే హీరోయిన్‌ను తన సినిమాల్లో రెండు, మూడు సార్లు రిపీట్ చేస్తూ ఉంటారు. సమంత తో మూడు సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత పూజా హెగ్డేను వరుసగా రిపీట్ చేస్తున్నారు. గతంలో గొవా బ్యూటీ ఇలియానా ను కూడా అలానే మూడు సినిమాలను చెయాలని కోరారు. దాంతో జులాయి ,జల్సా సినిమాలను చేశారు. రెమ్యునరేషన్ సేవింగ్ విషయంలో కూడా ఇలాంటి కమిట్మెంట్ లు తీసుకోవడం గమనార్హం..మళయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ త్రివిక్రమ్ రచన చేస్తోన్న భీమ్లా నాయక్ సినిమా లో రానా భార్య పాత్ర లో నటిస్తోంది. అలాగే తాను నిర్మించే మరో సినిమా లో కూడా ఆమెనే హీరోయిన్‌గా ఫిక్స్ చేశారట.. ఆమెతో కూడా మూడు సినిమాలు చెయాల్సింది.. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: