ఈ మధ్య సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబు అవుతున్నాయి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు 2. ఒకటి మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రం. ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా రేపు యువ హీరో సిద్ధార్థ జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలు కూడా దేనికవే ప్రత్యేకతను సంతరించుకున్న సినిమాలు.

ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలాడి చిత్రం భవిష్యత్తు తేలిపోయింది. రవితేజ కెరీర్ లో మరొక మంచి సినిమాగా ఇది నిలిచిపోయింది కొన్ని మైనస్ లు తప్ప ఈ చిత్రం చూడొచ్చు అని ప్రేక్షకులు నిర్ణయించారు. దీంతో ఈ సినిమా తర్వాత రేపు రాబోయే చిత్రంపై ఇప్పుడు అందరి చూపు పడింది. అదే డీజే టిల్లు. ఎంతో ఆసక్తి రేపిన ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ ఎలా చేసింది అని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

హీరోగా సిద్ధార్థ్ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా రోజులు అయిపోతుంది. అయితే కమర్షియల్ సక్సెస్ ఇంతవరకు అందుకోలేదు సిద్ధార్థ జొన్నలగడ్డ. దాంతో ఈ సారి రచయితగా అవతారం ఎత్తి ఇప్పుడు ఈ సినిమాను రూపొందించాడు ఆయన భావించి నట్లుగానే ఈ సినిమాపై భారీ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాడు. పాటల ద్వారా హీరోయిన్ ద్వారా ఈ చిత్రంపై ఇప్పటి వరకు మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నగా రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం హిట్ అవ్వాలంటే తప్పకుండా మంచి  కథా కథనాలతో మెప్పించాలి. ఆ విధంగా సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుంద అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: