టాలీవుడ్ లో వరుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ "సర్కారు వారి పాట" సినిమాతో 2022లో త‌న‌ విజయ పరంపరను కొనసాగించడానికి రెడీగా వున్నాడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సర్కారు వారి పాట సినిమాని టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.ఇక ఈ సినిమాకి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ మధ్య ఫుల్ ఫాంలో వున్న తమన్ తన ఫామ్ ని సర్కారు వారి పాట సినిమాతో కంటిన్యూ చెయ్యాలనుకుంటున్నాడు. తన కెరీర్లోనే ఎంతో ఇష్టంతో చేసిన అన్నిటికంటే బెస్ట్ ఆల్బమ్ ఇదేనని తమన్ ఇదివరకే ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా అనుకున్నట్లుగానే అదిరిపోయే ఆల్బమ్ తో మళ్ళీ దృష్టిలో పడ్డాడు. తాజాగా ఈ సినిమాలో తమన్ స్వ‌ర‌పరిచిన ఫ‌స్ట్‌ సింగిల్ 'కళావతి' ప్రోమో ఇటీవ‌ల విడుద‌లై ఫుల్ సాంగ్ కోసం అంద‌రూ ఎదురు చూసేలా చేసింది. ఒక రోజు ముందుగా ఫుల్ సాంగ్ లీకైనా కాని సూపర్ స్టార్ మహేష్ కి వున్న క్రేజ్ వల్ల మళ్ళీ విడుదల అయ్యి రికార్డులు బద్దలు కొడుతోంది.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మన్ ఇంకా సింగ‌ర్ సిద్ శ్రీరామ్ అలాగే లిరిసిస్ట్‌ అనంత శ్రీరామ్ సమిష్టి కృషితో ఈ పాట ఈ ఏడాది మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా నిలిచింది.సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కాని, పాటలు కాని జస్ట్ యావరేజ్ గా ఉంటేనే దుమ్ముదులుపుతాయి. అలాంటిది హిట్ అయితే ఇంకేముంది రికార్డులు బద్దలయ్యి కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. ఇక అలాంటి రికార్డ్స్ నే తాజాగా రిలీజ్ అయిన ఈ పాట సృష్టిస్తుంది. ఒక్కో రికార్డుని బద్దలు కొడుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది. తాజాగా ఈ పాట మరో సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా 1 మిలియన్ లైక్స్ సాధించిన పాటగా నిలిచింది. అలాగే వ్యూస్ లోనూ బాగా దూసుకుపోతుంది. ఇప్పటిదాకా ఈ పాటకు 22 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి. ఇంకా వస్తూనే వున్నాయి. ఇక మరో విశేషమేమిటంటే తలపతి విజయ్ బీస్ట్ మూవీ సాంగ్ 'అరబిక్ కుతు' గట్టి పోటీగా వున్నా కాని 'కళావతి' పాట మాత్రం ఇంకా యూ ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. ఇక ఈ పాటతో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: