సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న వారిలో నయనతార సమంత కూడా ఉన్నారని చెప్పవచ్చు.. ఇక సమంత,నయనతార సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.. ఇక వీరిద్దరికీ తమకు నచ్చిన పాత్రలు మాత్రమే ఎంచుకుంటూ సినిమా , వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతున్నారు.. నయనతార కంటే సమంత కాస్త ముందంజలో ఉందని చెప్పవచ్చు.. అయితే ఇలాంటి టాప్ హీరోయిన్లు ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూపించడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు.


కానీ నయనతార ప్రియుడు విగ్నేష్ శీవన్ మాత్రం సమంత ను ఎలాగైనా ఒప్పించి.. నయనతార, విజయ్ సేతుపతిలతో సినిమాలో నటించే అవకాశని ఆమెకు తీసుకువచ్చాడు.. ఇక వీరందరూ కలిసి నటిస్తున్న చిత్రం      కాతువాకుల రెండు కదాల్. నిన్నటి రోజున ఒక స్పెషల్ సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగిందట. లిరికల్ వీడియో లో అనిరుద్ అదరగొట్టేశాడు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే మరి కొన్ని సీన్స్ కూడా ఈ సినిమా నుంచి వెలువడడం జరుగుతోంది. టైటానిక్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే వీటితోపాటు సమంత నయనతార ఎంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా షేర్ చేశారు.. ఇక ఈ ఫోటోలను సమంత షేర్ చేస్తూ కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది.సమంత ఒక ఫోటోను షేర్ చేసి నయనతారకు తనకి ఉన్న బంధాన్ని ఇదే అంటూ తెలుపుకు వచ్చింది.. నయనతార సోషల్ మీడియాలో లేకపోయినప్పటికీ ఆమె తరఫున ప్రేమను నేను పంచుతున్నాను అంటూ తన అభిమానులకు చెప్పుకొచ్చింది.. దీంతో అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇద్దరు స్టార్ హీరోయిన్లు కేవలం ఒక్క సినిమాతోనే ఇలా బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా సమంత జీవితంలోకి ఎంతో మంది ఫ్రెండ్స్ సరికొత్తగా వస్తూనే వున్నారు అంటూ ఆమె అభిమానులు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: