ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మాత్రమే వినిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా  గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మన టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా ఇది. ఆర్ఆర్ఆర్ సినిమాకు థియేటర్స్ ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అభిమానుల నుంచి తమ థియేటర్లను రక్షించుకునే పనిలో పడ్డారు థియేటర్ యాజమాన్యాలు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో కొన్ని థియేటర్ల వద్ద తెరముందు ఫెన్సింగ్ లు అదేవిధంగా ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 అభిమానం హద్దులు దాటితే తమ థియేటర్లకే ప్రమాదం అనుకున్నారేమో ముందు జాగ్రత్తగా సిల్వర్ స్క్రీన్స్ ని రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇవన్నీ చూస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మానియా ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి గారి దర్శక త్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొ న్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా సినిమా ప్రమోషన్స్ చేస్తోంది.

 హైదరాబాద్ నుండి బెంగళూరు, అమృత్ సర్, ఢిల్లీ, బరోడా, జైపూర్, కొలకత్తా, వార ణాసి నుండి దుబాయ్ వరకు హీరోలు సినిమా ప్రమోషన్స్ కోసం దేశంలోని అన్ని ప్రధాన సంభా వ్య మార్కెట్ లను సందర్శిం చారు. మార్చి 25 నుండి అన్ని థియేటర్లలో త్రీడీలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని యాక్షన్ మరియు డ్రామాను మనం చూడవచ్చు. పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ,మలయాళ భాషల్లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: