అయితే ఇందులో షారుక్ ఖాన్ స్థానంలో రణ్వీర్ సింగ్ నటించబోతున్నట్లు పేరు వినిపించడంతో షారుక్ అభిమానులు షాక్ కి గురయ్యారు. సినిమా ఇంకా సెట్స్ మీదికి వెళ్ళకముందే సోషల్ మీడియాలో పలు రకాల రూమర్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ మళ్లీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని షారుక్ ఖాన్ ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షారుక్ ఖాన్ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది.
డాన్ 3 సినిమాపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ తనను టీమ్ ఇంతవరకు సంప్రదించలేదని, తన దగ్గరికి వచ్చి టీమ్ అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు కూడా ఎలాంటి సెన్సేషనల్ వార్తలను ప్రచారం చేయవద్దు అంటూ తెలియజేశారు. దీంతో రణ్వీర్ సింగ్ స్థానంలో షారుక్ ఖాన్ వస్తున్నారనే వార్తలకు ఇలా చెక్ పెట్టారు. రణ్వీర్ సింగ్ ఇందులో డాన్ పాత్రలో కనిపించబోతున్నారని ఆయనకు జోడిగా కియారా అద్వానీ నటించబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ఫర్హాన్ ఆక్తర్ ఈ చిత్రాన్ని చాలా స్టైలిష్ గా ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మరి సినిమాకు సంబంధించి అధికారికంగా చిత్ర బృందం పోస్టర్ తోనైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి