తాజాగా టాలీవుడ్లో వినిపిస్తున్న ప్రకారం.. బాలయ్య మాస్ ఎలిమెంట్స్ ని పక్కన పెట్టేసి మరి ఒకసారి కొత్త జోనర్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ జోనర్ ఏదో కాదు థ్రిల్లర్. ఈమధ్య ఆడియన్స్ కూడా ఈ తరహా సినిమాలనే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటూ ఊహకు అందని మలుపులతో సినిమాలు ఉంటాయి కాబట్టి ఈ జోనర్ సినిమాలకు ఎక్కువగా ప్రేక్షకాదరణ పెరిగిపోయింది. అందుకే బాలయ్య అలాంటి కథతో సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు వినిపిస్తున్నాయి.
అందుకోసం యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఒక సినిమా చేయబోతున్నారట బాలయ్య. గతంలో ఈ డైరెక్టర్ మెంటల్ మదిలో, సరిపోదా శనివారం, బ్రోచేవారెవరు తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈసారి వివేక్ ఆత్రేయ ఒక అదిరిపోయే థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారని ఆ సినిమాకి బాలకృష్ణ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఈ కథ కూడా బాలకృష్ణకు వినిపించగా కొత్త జోనర్ కావడం చేత ఓకే చెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ జోనర్ సక్సెస్ అయితే బాలయ్య ఇక పూర్తిగా మాస్ సినిమాలకు దూరమయ్యేటట్టుగా కనిపిస్తోంది. బాలయ్య అభిమానులకు మాత్రం మాస్ సినిమాలే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మరి అలాంటి జోనర్ నుంచి బాలయ్య తప్పుకొని ఇప్పుడు కొత్త జోనర్లో రాబోతుండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి