సూపర్ స్టార్ కృష్ణ అంటేనే తెలుగు ఇండస్ట్రీలో ఒక అరుదైన గౌరవం ఉన్నటువంటి నటుడు. ఆయన కూడా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి చాలా అద్భుతంగా సినిమాల్లో నటించారు. కానీ ఆయన నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా వెనక ఒక కథ ఉందని తెలుస్తోంది అది ఏంటో తెలుసుకుందామా.? 1968లో కృష్ణ అసాధ్యుడు సినిమా చేశారు. ఆ చిత్రం ఆయనకు పన్నెండవ చిత్రం. ఆ సినిమాలో అల్లూరి సీతారామరాజు సంబంధించిన సన్నివేశం ఉంది.

 ఇది కృష్ణ గారిని ఎంతగానో ఆకర్షించింది. అప్పుడే ఆయన అల్లూరి సీతారామరాజుపై మంచి సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. ఆ సమయంలోనే సినిమాలతో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. కృష్ణ గారి మనసులో మెదిలినటువంటి ఆలోచన రూపు దాల్చడానికి 15 సంవత్సరాలు పట్టింది. అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా తీయాలని చాలా మంది ప్రముఖులు తాపత్రయపడ్డారు. 1953లో అక్కినేనితో ఈ సినిమా తీయాలని ప్రముఖ దర్శకుడు ప్రకాష్ రావు కథ కూడా తయారు చేసి పెట్టారు. కానీ అది కుదరలేదు. 1958లో జగ్గయ్య సీతారాముల కళ్యాణం అంతర్నాటకంగా చేసిన అల్లూరి సీతారామ రాజు కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సీతారామరాజు పూర్తి సినిమా తయారయింది. ఆతర్వాత 1959లో గ్రామ్ఫోన్ రికార్డు వారు సీతారామరాజు కథను ఆరు భాగాలుగా విడుదల చేశారు. అందులో అల్లూరి సీతారామరాజు జగ్గయ్య, రూథర్ఫర్డ్ గా గుమ్మడి నటించారు ఇది ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. 1953-54 మధ్యలో ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు తియ్యాలి అనుకొని పడాలి రామారావుతో స్క్రిప్ట్ రాయించారు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో మేకప్ స్టైల్స్  కూడా తీయించుకున్నారు. ఈ సినిమా చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన సినిమా మాస పత్రికలు కూడా వెలువడ్డాయి.

ఆ తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన ఒక పాటను కూడా ధృవీకరించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమా తీస్తానని అప్పుడప్పుడు ప్రకటిస్తూనే వచ్చారు. శోభన్ బాబు తో ఈ సినిమా తియ్యాలి అనుకొని వి ఎల్  నారాయణ స్క్రిప్ట్ వ్రాయించారు. ఆయన కూడా నిర్మాణాన్ని విరమించు కున్నారు. దీన్ని కృష్ణ గారితో ఈ సినిమా తియ్యాలనే జ్యోతి పిక్చర్స్ శేఖర్ బాబు శ్రీ వాణి పిక్చర్స్ అధినేత సుబ్బరాజు కూడా ఉత్సాహ పడ్డారు. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో విడుదల తర్వాత కృష్ణ రామచంద్ర రావు దర్శకత్వంలో అల్లూరి సీతారామరాజు చిత్రానికి నాంది పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: