ఇకపోతే ఒక హీరో అభిమానులు వచ్చి సింహభాగం టికెట్లు తమకే కావాలని పట్టుబట్టగా ఇది తెలుసుకున్న మరో హీరో అభిమానులు గొడవకు దిగారు. అంతేకాదు గందరగోళంగా మారిన పరిస్థితులలో థియేటర్లో ఒక తెలుపుతో పాటు అద్దాలకు కూడా అభిమానులు ధ్వంసం చేసి నానా రభస సృష్టించారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా.. మరింత ఉద్రిక్తం చోటుచేసుకుంది. ఇకపోతే విడుదల సందర్భంగా పద్మశాలి పేటకు చెందిన కొంతమంది అభిమానులు ఇద్దరూ కథానాయకుల ఫోటోలను పట్టుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
ఇక అభిమానం ఎంతలా ఉంది అంటే హీరోల చిత్రాలకు రక్త తిలకం కూడా దిగారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఉన్నచోట్లలో ఆర్ ఆర్ ఆర్ సినిమా మేనియా నడుస్తోంది.. ఇప్పటికే బెనిఫిట్ షో లతోపాటు ప్రీమియర్ షోలు కూడా మొదలవడం జరిగింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ తోపాటు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో పాటు అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ ,సముద్రకని కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందే రికార్డు సృష్టించిన ఈ సినిమా ఈ రోజు మొదటి షో తో మరి కొన్ని రికార్డులను చెరిపివేసింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి