మెగాస్టార్ చిరంజీవి ఎక్కడో మొగల్తూరులో పుట్టి పెరిగిన ఈయన సినిమాల పై ఉన్న ఎంతో మక్కువతో మద్రాసు వచ్చి నటనలో శిక్షణ పొందారట.. రెండేళ్ళ పాటు మాత్రమే ఈయన సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలని, కుదరని పక్షంలో తన చదువుకి తగ్గ ఉద్యోగం వెతుక్కోవాలని డిసైడ్ అయ్యారట.

ఇదే విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. ఈయన కష్టానికి తగ్గ ఫలితం ఆయనకు అనుకూలంగానే వచ్చింది. మొదట్లో నెగిటివ్ రోల్స్ అలాగే సైడ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చిన కూడా ఈయన తర్వాత హీరోగా మారారు.

 

1978వ సంవత్సరం నుండీ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూనే వస్తున్నారు. ఇదే క్రమంలో 'ఖైదీ' చిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యి ఈయనకి భారీ స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. అటు తర్వాత ఈయన వరుస సినిమాల్లో నటిస్తూ వరుసగా హిట్లు కొడుతూ వచ్చారు. అయితే 1994,95 సంవత్సరాల్లో ఈయన నటించిన సినిమాలు ఎస్.పి.పరశురామ్ అలాగే బిగ్ బాస్, రిక్షావోడు ప్లాప్ లు అయ్యాయి. ఒక్క ముగ్గురు మొనగాళ్ళు మాత్రమే యావరేజ్ గా నిలిచింది.

 

ఈ టైంలో చిరు పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. చిరంజీవి పని అయిపోయిందని అలాగే ఆయన హిట్లు కొట్టడం ఇక కష్టమే అని.. ఇలా ఘోరమైన కామెంట్లు కూడా చాలానే వినిపించాయి. చిరు కూడా ఆ టైములో రాజశేఖర్ లా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని మాస్ సినిమాల జోలికి అస్సలు పోకూడదని భావించారట. దాంతో 1996 వ సంవత్సరం మొత్తం ఆయన కథలు వినడానికే డిసైడ్ అయ్యారట.. కొంత గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు కానీ హిట్ కొట్టాలని భావించారు చిరు.

 

అలా మలయాళంలో మమ్ముట్టి నటించిన 'హిట్లర్' మూవీ కథ విన్నారట.. మొదట ఈ ప్రాజెక్టు మోహన్ బాబు- ఇ.వి.వి.సత్యనారాయణ కాంబినేషన్లో రూపొందుతుంది అంటూ ప్రచారం అయితే జరిగింది. కానీ వాళ్ళ కాంబోలో అప్పటికే మరో సినిమా రూపొందుతుండడంతో అది కుదరలేదు.. అలా అది చేతులు మారుతూ చిరు- ముత్యాల సుబ్బయ్య చేతులకి వెళ్ళిందట.. 1997 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచి మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: