మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  రవితేజ తన కెరియర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.  ఇడియట్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న రవితేజ ఆ తరువాత ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,  అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,  విక్రమార్కుడు,  కిక్,  డాన్ శీను , క్రాక్ వంటి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు,  ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ కొన్ని రోజుల క్రితం  ఖిలాడి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

  కాకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది,  ఇది ఇలా ఉంటే మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ , ధమాకా ,  రావణాసుర సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాలతో పాటు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'  అనే సినిమాలో కూడా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే,  తాజాగా ఈ మొవు కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర బృందం  బయటకు వదిలింది.  టైగర్ నాగేశ్వర్ రావు ముహూర్తం మరియు ఫ్రీ లుక్ ను ఏప్రిల్ 2 వ తేదీన 12. 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది,  ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించబోతున్నాడు, ఈ మూవీ ని అభిషేక అగర్వాల్ నిర్మించబోతున్నాడు.  ఈ మూవీ కి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నారు,  ఈ సినిమాను తెలుగు , తమిళ ,  హిందీ,  కన్నడ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: