టాలీవుడ్ ఇండస్ట్రీలో నితిన్ ని హీరోగా నిలబెట్టడానికి తొలి బ్రేక్ ఇచ్చిన చిత్రం జయం. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్ అని చెప్పాలి. కథ పరంగా , నటీనటుల పరంగా, పాటల పరంగా, సంగీతం పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఎటు చూసినా యువత నోట ఈ సినిమా విశేషాలే. అమ్మాయిల కాళ్లకు నిండా గల్లు గల్లుమని గజ్జలు పెట్టుకోవడం ట్రెండ్ అయిపోయింది. ముఖ్యంగా వెళ్లవయ్యా వెళ్ళు అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాతో నితిన్ హీరోగా పరిచయమయ్యారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి మొదట హీరో గా బన్నీని అనుకున్నారన్న విషయం చాలా మందికి తెలుసుండక పోవచ్చు.

అవును మీరు వింటున్నది నిజమే... ఈ మూవీ దర్శకుడు  తేజ మొదట ఈ కథను అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే అప్పటికే బన్నీని  దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తానే అల్లు అర్జున్ ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తాను అని చెప్పడం... అదే కాకుండా ఇలాంటి పెద్ద డైరెక్టర్ గంగోత్రి చిత్రానికి బన్నీ ఒకే చెప్పడంతో తేజ సైలెంట్ అయిపోయారట. అలా బన్నీ  అకౌంట్ లోకి వెళ్లాల్సిన ఈ సూపర్ హిట్ మూవీ నితిన్ ఖాతాలో పడింది. దర్శకుడు తేజ బన్నీ ఇక ఈ మూవీని చెయ్యరు అని ఫిక్స్ అయ్యాక కొత్త ముఖం కోసం వెతుకుతుండగా అప్పట్లో నైజాం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న సుధాకర్ రెడ్డి తన తనయుడు నితిన్ ను చూడమని అడగడం ఆ తరవాత  దర్శకుడు తేజకు నితిన్ నచ్చడం సినిమా చెయ్యడం అన్ని అలా చక చకా జరిగిపోయాయి.

కట్ చేస్తే పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన జయం మూవీ భారీ  విజయాన్ని అందుకొని ఇండస్ట్రీకి  అదిరిపోయే హిట్ ను ఇచ్చింది. ఒకవేళ ఆ రోజు రాఘవేంద్రరావు కనుక బన్నీ ని జయం సినిమా కోసం వదిలేసి ఉంటే, ఇండస్ట్రీకి రెండు మిస్ అయ్యి ఉంటాయి. ఒకటి నితిన్ లాంటి యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో మిస్ అయ్యేవాడు మరియు గంగోత్రి లాంటి మూవీహీరో చేసేవాడో ? ఎలా ఉదనేదో అన్న ఫీలింగ్ ఉండేది. ఒక విధంగా బన్నీ నితిన్ కెరీర్ కు ఆ విధంగా ఫ్లూ అయ్యాడని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: