
ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ నుండి మొన్నటి సాంగ్స్, ట్రైలర్ వరకు అన్ని కూడా మూవీ పై అందరిలో విపరీతమైన అంచనాలు పెంచేసాయి. ఆ విధంగా భారీ స్థాయి హైప్ ఏర్పరిచిన సర్కారు వారి పాట మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ మూవీ ప్రీ రివ్యూ నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేలా టాక్ ని సొంతం చేసుకుంది. సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన పాత్రలో జీవించేశారని అంటున్నారు. ఆయన ఈ క్యారెక్టర్ లో పలికిన డైలాగ్స్, స్టైల్, యాక్టింగ్ అదిరిపోయిందని, అలానే హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా ఎంతో బాగా నటించారని చెప్తున్నారు.
మహేష్, కీర్తి ల మధ్య వచ్చే సీన్స్ అయితే అందరినీ ఎంతో అలరిస్తాయట. థమన్ అందించిన సాంగ్స్ ని మది తన ఫోటోగ్రఫితో మరింతగా అదరగొట్టారని, థమన్ సాంగ్స్ మాత్రమే కాదు బీజీఎమ్ అయితే మరొక లెవెల్లో ఉందని చెప్తున్నారు. సినిమాలో భారీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయని, ఫస్ట్ హాఫ్ ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిన సర్కారు వారి పాట మూవీ, సెకండ్ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగుతూ అన్ని వర్గాల ఆడియన్స్ ని ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకోవడం, బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం కూడా పక్కా అని అంటున్నారు. మరి ఈ సినిమా ఈరోజు తొలిరోజు తొలిఆట నుండి ఎంత మేర కలెక్షన్స్ ని కొల్లగొడుతుందో చూడాలి.