మోడ్రన్ పేరుతో శరీరంలోని అన్నీ భాగాలు బయట ఉండేలా చేసి యువతకు కన్నుల పండుగ చేస్తున్న నటులు ఎందరో వున్నారు. ముఖ్యంగా బాలివుడ్ ముద్దుగుమ్మలు మాత్రం అదే పనిలో ఉన్నారు.. అందులో కొందరు అయితే చెప్పనక్కర్లేదు.. ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనె వరకూ అదే పనిలో ఉన్నారు.. ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అని అంటున్నారు.


ఆ జాబితాలోకి ఇప్పుడు మరో బ్యూటీ వచ్చి చేరింది.ఉర్ఫీ జావెద్ హిందీ ప్రేక్షకులకు, నెటిజన్లకు ఆమెను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గా పరిచయమైన ఈ అమ్మడు అందాల ఆరబోతలో మాత్రం అశ్లీల తారలను సైతం మించిపోతోంది. పూటకో డ్రెస్‌ మారుస్తూ ..వాటితో వివిధ భంగిమల్లో ఫోటోలు దిగుతూ..సోషల్ మీడియా లో పోస్ట్ చేసి నెటిజన్ల దృష్టిని తనవైపు మళ్లేలా చేసుకుంటుంది. ఈ హార్ట్‌ లేడీ మరోసారి గౌన్లు, దుస్తులకు బదులు గోనె సంచి ని కట్ చేసి డ్రెస్‌గా మార్చేసుకుంది. ఉర్ఫీజావెద్‌ లేటెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్‌కి సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది..



తన డ్రెస్ కు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.లేటెస్ట్‌ డ్రెస్‌తో దిగిన ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ..మాములుగా ట్రోల్ చేయడం లేదు. ఇంత బరితెగింపు ఎందుకని చివాట్లు పెడుతున్నారు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా..ఎన్ని గ్రూప్‌లో ట్రోల్ చేసినా.. నేను మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ అమ్మడి డ్రెస్సింగ్‌ స్టైల్‌ చూసిన వాళ్లంతా ఇవి దుస్తులా లేక లోదుస్తులా అని కామెంట్ చేశారు. కాని ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఈమెకి పిచ్చి పీక్స్‌కి చేరిందని ట్రోల్ చేస్తున్నారు. గోనె సంచిని టూ పీస్‌ డ్రెస్‌గా మార్చుకోవడం ఏమిటని గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు..ఏంటో ఈ జనాలకు పిచ్చి ముదిరి పోతుంది..ఇంకేం దారుణాలు చూడాలో మున్ముందు..


మరింత సమాచారం తెలుసుకోండి: