ఏంటి విమాన ప్రమాదం లో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం వెనుక టిడిపి నేతల హస్తం ఉందా..ఇది నిజమేనా.. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఆయన విమాన ప్రమాదంలో మరణించడం దాని గురించి ఎన్సీపీ నేత రోహిత్ పవార్ టిడిపి నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. అజిత్ పవార్ ప్రయాణించిన విఎస్ఆర్  విమానయాన సంస్థ యజమాని అయినటువంటి రోహిత్ సింగ్ కి టిడిపి నేతలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 

వెంటనే రామ్మోహన్ నాయుడిని పదవి నుండి తొలగించాలి.ఎందుకంటే విచారణలను వీరు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అజిత్ పవార్ ది సహజ మరణం కాదు. ప్రణాళిక ప్రకారం హత్య చేశారు. విచారణ అనేది నిష్పక్షపాతంగా జరగాలంటే కచ్చితంగా రామ్మోహన్ నాయుడిని పదవి నుండి తొలగించాలి. రోహిత్ సింగ్ ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు 35 కోట్ల విలువ చేసే విమానానికి 210 కోట్ల భీమా ఉండడం వెనుక ఉన్న అర్థం ఏంటి.. దీని వెనక భారీ ఆర్థిక లావాదేవీల కుట్రకోణం జరుగుతుంది.

 పైలెట్ ని బ్లాక్ మెయిల్ చేసి మరీ విమానంలోని ఇంధనాన్ని అక్రమంగా తరలించారు. ప్రమాదం కూడా పైలెట్ ని బెదిరించి చేయించి ఉంటారు. విచారణ పూర్తికాకుండా విఎస్ఆర్ విమానయానసంస్థ యజమాని రోహిత్ సింగ్ ని దేశం విడిచి బయటకు వెళ్లడానికి అనుమతి ఎలా ఇస్తారు.. బ్లాక్ బాక్స్ బాగున్నప్పటికీ పాడైపోయిందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు.. అంటూ ఎన్సిపి నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఈ ఎన్సిపి నేత రోహిత్ పవార్ ఎవరో కాదు అజిత్ పవార్ మేనల్లుడే..

మరింత సమాచారం తెలుసుకోండి: