చంద్రముఖి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఆ సినిమా వచ్చి చాలా రోజులు అయిన కూడా సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు..ఆ సినిమా కథ బాగుండటం తో పాటు సినిమాలొని యాక్టర్ లు అందరూ పోటీ పడి మరీ నటించారు.. తెలుగు, తమిళ్ లో ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'చంద్రముఖి' చిత్రం అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే..


రజినీతో పాటు జ్యోతిక, నయనతార కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్‌లు ఇచ్చి ఈ సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించారు. ఇక దాదాపు ఏడేళ్ల తరువాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సీక్వెల్ సినిమాలో ఈసారి హీరో మారిపోయాడు.. చంద్రముఖి 2' చిత్రాన్ని తాజాగా అనౌన్స్ చేసింది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. దర్శకుడు పి.వాసు మరోసారి ఈ హార్రర్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో తమిళ కమెడియన్ వడివేలు మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవుతుండటంతో ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు..

 

సినిమా ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది.లారెన్స్ కూడా ఇలాంటి జోనర్ సినిమాలు బోలెడు చేయడంతో, ఈసారి చంద్రముఖి సీక్వెల్‌లోనూ ఆయన అదరగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. కాగా.. ఈ సినిమాకు తోట తరణి, ఆర్.డి.రాజశేఖర్ వంటి టెక్నీషియన్స్ పనిచేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజువల్ ట్రీట్‌గా రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈసారి చంద్రముఖి పాత్రలో ఎవరు నటిస్తారా? జ్యోతిక ను తీసుకుంటారా లేక కొత్త. వాళ్ళా అనేది తెలియాల్సి ఉంది..ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: