హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉంటే.. కొంతమంది హీరోలు మాత్రం కొత్త తరహా సినిమాలతో మార్కెట్ లోకి వస్తున్నారు. అయితే హీరో గోపీచంద్ మాత్రం ఇంకా కొత్త హీరోల కంటే కాస్త రేసులో వెనుకబడి ఉన్నారని చెప్పవచ్చు. ఆయన హిట్ మూవీ మాట విని దాదాపుగా ఏడు సంవత్సరాల పైన అవుతుంది. తర్వాత ఆయన ఏడు సినిమాలు చేస్తే అందులో ఏవి కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక గత సంవత్సరం సంపత్ నంది డైరెక్షన్లో వచ్చిన సిటీ మార్ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా చెప్పుకోదగ్గ కలెక్షన్స్ లో మాత్రం రాలేదు.


కానీ హీరో గోపీచంద్ కు మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు ఈ చిత్రం. ఇక తాజాగా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో పక్కా కమర్షియల్ సినిమా పైన దృష్టి పెట్టాడు. ఈ సినిమాని డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ -2 ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ సినిమాకి తగ్గట్టుగానే పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు డైరెక్టర్ మారుతి. ఇందులో హీరోయిన్ గా  రాశి ఖన్నా నటించింది.

జూలై 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కు సిద్ధంగా ఉండటంతో ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని చాలా వేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ని క్రియేట్ చేసింది. హీరో గోపీచంద్ తో  డైరెక్టర్ మారుతి ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఇందులో సత్యరాజ్, గోపీచంద్ ల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. రాశి ఖన్నా, గోపీచంద్ కి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా చూపించారు. ఇక గోపీచంద్ తో పాటు చిత్ర బృందం కూడా ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: