
ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే తిరుగు లేదనుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా విడుదల విషయంలో ఎన్నోసార్లు వాయిదా పడడమే కాకుండా ఈ సినిమా కోసం సుమారుగా రెండేళ్లకు పైగా తన సమయాన్ని కేటాయించింది. చివరికి ప్రమోషన్స్ ను తన భుజాన వేసుకున్న కష్టమంతా వృధాగా మారిపోయింది. ప్రస్తుతం హీరోయిన్స్ ఎక్కువగా ఐటెం సాంగ్లలో కనిపిస్తూ పేరు సంపాదిస్తున్నారు. అలా నిది అగర్వాల్ కూడా మిరాయ్ సినిమాలో స్పెషల్ స్టెప్పు లేసిన చివరికి అందులో నుంచి ఆమె పాటను తొలగించారు. తను నటించిన ఆనందం కూడా ఆమెకు దక్కలేదు.
నిధి అగర్వాల్ ఆశలన్నీ కూడా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా మీదే పెట్టుకుంది. ఇందుకోసం కూడా సుమారుగా రెండేళ్ల పాటు తన సమయాన్ని కేటాయించింది. అయితే ఈ సినిమా కూడా వాయిదాలతో వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతోంది. రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ కి మరింత సమయం ఉండడం చేత ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కి వెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఉన్నది కేవలం రాజాసాబ్ సినిమా మాత్రమే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయమైతే ఈమె కెరియర్ మరొక లాగా ఉంటుంది. ఇప్పటికే సక్సెస్ చూడక ఆరేళ్ళు అవుతూ ఉన్న నిధి.. ప్రభాస్ సినిమాతో ఈమె లక్ మారుతుందేమో చూడాలి.