టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌ పోతినేని హీరోగా తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'ది వారియర్‌'. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక వరుస విజయాలతో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు తమిళ నటుడు ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా అలాగే అక్షర గౌడ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. రామ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 14 వ తేదీన రిలీజ్‌ కానుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌ ఇంకా అలాగే పోస్టర్స్‌ అన్నీ కూడా ఆడియెన్స్‌ను చాలా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అందులోనూ ఈ సినిమా నుంచి 'బుల్లెటు' సాంగ్ అయితే ఈ మధ్య కాలంలో పెద్ద వైరల్ హిట్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది.


ఇక ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌. శుక్రవారం నాడు అనగా ఈరోజు (జూలై 1) దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగు ట్రైలర్‌ విడుదల చేయగా ఇంకా తమిళ ట్రైలర్‌ను స్టార్‌ హీరో శివ కార్తికేయన్‌ రిలీజ్‌ చేశాడు. ఆద్యంతం ఊర మాస్‌ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో రామ్‌ మంచి ఎనర్జెటిక్ పవర్ ఫుల్ పోలీసు ఆఫసర్‌గా కనిపిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి సూపర్ విలన్‌గా మరోసారి మెప్పించనున్నాడు. సరైనోడు తరువాత ప్రతి కథానాయకుడిగా ఆది ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఇంకా అలాగే సరికొత్తగా కనిపించబోతున్నాడని ఈ ట్రైలర్‌ చూస్తుంటే చాలా ఈజీగా అర్థమవుతోంది.ఖచ్చితంగా రామ్ కి ఇస్మార్ట్ శంకర్ లాంటి ఊర మాస్ హిట్ దక్కడం ఖాయంలా ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: