టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్షణం అనే సస్పెన్స్ త్రిల్లర్ మూవీ తో హీరో గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను తెచ్చుకున్న అడవి శేషు ఆ తర్వాత గూడచారి , ఎవరు మూవీ ల విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరో గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా మేజర్ మూవీ లో హీరోగా నటించిన అడవి శేషు ఈ మూవీ తో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మేజర్ మూవీ కి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మేజర్ మూవీ ని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇది ఇలా ఉంటే అడవి శేషు తన కెరీర్ లో సూపర్ హిట్ సాధించిన ఒక మూవీ ని అదిరిపోయే రేంజ్ లో సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన గూడచారి సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని అని అడవి శేషు  ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే అడవి శేషు ప్రస్తుతం హిట్ ద సెకండ్ కేస్ హిట్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే హిట్ ద సెకండ్ కేస్ మూవీ నుండి చిత్ర బృందం గ్లిమ్స్  వీడియోని విడుదల చేయగా ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: