ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ 2వ సతీమణి అయిన రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. ఈమె ఆయనతో కలిసి కెరియర్ మొదటలో సినిమాలలో నటించింది.ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని రోజులు సహజీవనం కూడా చేసింది.ఇక ఈ నేపథ్యంలో నే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై ఇప్పటికి పలు రకాల విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.ఇక మొదటి భార్య నందిని ఉండగానే పవన్ రేణు దేశాయ్ తో సహజీవనం చేసి అఖీరానందన్ కు జన్మనిచ్చాడు.అప్పుడు నందినీకి విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ని వివాహం చేసుకున్నారు. ఇక తరువాత రేణు దేశాయికి కూడా విడాకులు ఇచ్చి రష్యాకి చెందిన యువతి అయిన అన్నాలేజినోవా ను వివాహం చేసుకున్నారు.అయితే ఇక తమ విడాకులపై ఎప్పుడూ కూడా నోరు విప్పలేదు రేణూ దేశాయ్.


కానీ ఎట్టకేలకు ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాలను కూడా తెలియజేసింది. ముందుగా పవన్ కళ్యాణే తన వద్దకు వచ్చి విడాకులు అడిగారని తెలియజేసింది.అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అప్పుడే చాలా యాక్టివ్ గా ఉండడం చేత.. పవన్ కళ్యాణ్ పరువుకు భంగం కలగకూడదని ఆమె విడాకులకు అంగీకరించానని రేణు తెలియజేసింది.ఇక ఆ సమయంలో తన పిల్లలు అకీరా, ఆధ్యా చాలా చిన్నవారని వారిని తానే పెంచుతున్నానని తెలియజేసింది. కానీ విడాకుల తర్వాత అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయని దాంతో ఇద్దరు పిల్లలను ఒక తల్లిగా పెంచడం చాలా కష్టమైందని ఆమె తెలిపింది. అయితే రేణూ దేశాయ్ మాట్లాడిన ఈ మాటలు చాలా సంవత్సరాల క్రితమే అయినా కానీ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: