సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా ప్రభు , జ్యోతిక ఇతర కీలక పాత్రల్లో పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంది మన అందరికీ తెలిసిందే. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన చంద్రముఖి సినిమా అప్పట్లో తమిళ్ మరియు తెలుగు రెండు భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని కలెక్షన్ ల వర్షం కురిపించింది.

ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 మూవీ ప్రస్తుతం తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. చంద్రముఖి 2 మూవీ లో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా పి వాసు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా చంద్రముఖి 2 మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో రాఘవ లారెన్స్ సరసన ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలు ఆడి పాడనునట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో లారెన్స్ సరసన లక్ష్మి మీనన్ , మంజిమా మోహన్ , మహిమ నంబియార్ , సృష్టి దాంగే ,  సుభిక్ష కృష్ణన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే. ఈ ఐదుగురు ముద్దుగుమ్మలు ఇప్పటికే షూటింగ్ ల్9 కూడా జాయిన్ అయినట్లు సమాచారం. మరి ఈ ఐదుగురు ముద్దుగుమ్మ లలో అసలు చంద్రముఖి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రముఖి సినిమా మంచి విజయం సాధించడంతో చంద్రముఖి 2 మూవీ పై సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: