వెండితెర పై ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు అనే పేరు కలిగిన దర్శకుడు హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా మృణాళిని ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో రష్మిక మందన ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్  ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రియదర్శి , మురళి శర్మ , ప్రకాష్ రాజ్ సునీల్ ఈ మూవీలో మరికొన్ని ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీ నఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది. 

మరీ ముఖ్యంగా ఈ మూవీ లో మెయిన్ లీడ్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ , మృణాళిని ఠాకూర్ వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా అద్భుతంగా ఉన్నాయి అంటూ ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా అద్భుతమైన కలెక్షన్  లను వసూలు చేస్తోంది. ఇలా సక్సెస్ ఫుల్ గా  బ్లాక్ బస్టర్ విజయం వైపు సీతా రామం మూవీ దూసుకుపోతోంది. ఇలా ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ రోజు ఈ మూవీ యూనిట్ థాంక్యూ మీట్ ను ఏర్పాటు చేసింది. థాంక్యూ మీట్ హైదరాబాద్ లోని పార్క్ హయత్ లో ఈరోజు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. థాంక్యూ మీకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: