
మోడల్ గా కెరీర్ ప్రారంభించి మిస్ కర్ణాటక 2015, మిస్ దివా సుప్రనేషనల్ 2016తో సహా ఎన్నో టైటిల్స్ గెలుచుకున్న బెంగళూరు భామ శ్రీనిధి శెట్టి.. ` కేజీఎఫ్ ` మూవీతో నటిగా వెండితెరపై అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో స్టార్డమ్ సంపాదించుకుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ` కోబ్రా ` రూపంలో బిగ్ ఫ్లాప్ పడ్డప్పటికీ.. తాజాగా ` హిట్ 3`తో శ్రీనిధి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. తెలుగులో శ్రీనిధి శెట్టికి ఇదే తొలి చిత్రం.
న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే 1న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె అలరించింది. హిట్ 3 విజయంతో శ్రీనిధి క్రేజ్ మరింత పెరిగడంతో.. తాజాగా ఆమె వద్దకు ఓ బిగ్ ప్రాజెక్ట్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ` AA22 ` వర్కింగ్ టైటిల్ తో మూవీని అనౌన్స్ చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు రూ. 800 నుంచి రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మెయిన్ హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయట. ఇదే నిజమైతే శ్రీనిధి శెట్టి నక్క తోక తొక్కినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం శ్రీనిధి శెట్టి తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా తెలుసు కదా అనే చిత్రంలో యాక్ట్ చేసింది. మరోవైపు కన్నడలో కిచ్చ సుదీప్ 47వ చిత్రానికి కూడా సైన్ చేసింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు