నాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం దసరా. ఈ చిత్రంతో నాని మొదటిసారిగా పాన్ ఇండియా హీరో గా మారబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఈ సినిమాని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. దసరా సినిమా కోసం నాని మొదటిసారిగా ఒక మాస్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఇందులో తెలంగాణ భాషలో నాని డైలాగులు చెప్పబోతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా కథంతా పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని లో సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో సెట్ వేసి ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ కు విశేష స్పందన లభించినది. నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి మాస్ హీరో అనిపించుకోవాలని ఉద్దేశంతోనే ఈ సినిమాని చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నాని పోస్టర్ ను చూసిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. నాని ఇంతకుముందు ఎన్నడూ చూడని పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ రోజున ఒక బిగ్ అనౌన్స్మెంట్ తీసుకురావడం జరిగింది.ఇక దసరా చిత్రాన్ని శ్రీరామనవమి సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా అప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా ఈ సినిమాకి కలిసి వస్తాయని ఉద్దేశంతోనే ఈ సినిమా డేట్ లాక్ ను చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే.. ఈ డేట్ లాక్.. పోస్టర్ విషయానికి వస్తే అతని శరీరం మరియు దుస్తులు కూడా చాలా దుమ్ము పట్టిపోయి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక హెయిర్ స్టైల్ కూడా చాలా విభిన్నంగా ఉండి చేతిలో మద్యం సీసాతో.. తన బ్యాక్ గ్రౌండ్ ఒక పాపులర్ నటి సిల్క్ స్మిత కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: