టాలీవుడ్ హీరోలలో నితిన్ కూడా ఒకరు. ఇక ఈ హీరోకి ఎన్నో అపజయాలు ఎదురైనా కూడా మళ్లీ ఏదో ఒక రూపంలో తనకి అవకాశాలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి హిట్టు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కేవలం కమర్షియల్ హిట్స్ తోనే నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాడు. చివరిగా మంచి విజయాన్ని అందుకు ఉండేది నితిన్ ఆ ఆ సినిమా తప్పితే నితిన్ కెరియర్ ని మార్చిన ఏ సినిమా కూడా మరి అంతటి విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు..



ఇక ఇటీవల వరుస పరాజయాలను ఎదుర్కొంటూ ఉన్నాడు నితిన్ మళ్లీ ఒకసారిగా తన కెరియర్ డౌన్ అయిందని చెప్పవచ్చు.. ఇక భీష్మ  సినిమా తర్వాత ఏ సినిమా కూడా తనకి అంతగా వర్కౌట్ కాలేదు. ఇటీవల వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాని తన సొంత బ్యానర్ లోనే నిర్మించారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే మరొక రెండు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నితిన్. డైరెక్టర్ భీష్మ దర్శకుడు తో కూడా మరొక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


ఇక ఇవే కాకుండా డైరెక్టర్ సాగర్ కె చంద్ర తో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అటు డైరెక్టర్, నితిన్ కూడా ఇద్దరు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి వీరి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం చూడాలి. మరి నితిన్ కి వరుస ప్లాపులు వచ్చిన ఇలా అవకాశాలు రావడంతో సద్వినియోగం చేసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: