టాలెంటెడ్ నటుడు సత్య దేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా గుర్తుందా సీతాకాలం అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసింది.  ప్రేమ కథాంశం తో తెరకెక్కిన ఈ మూవీ కి నాగ శేఖర్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ విడుదల తేదీ ని మార్చేసింది. అలాగే ఈ సినిమా కొత్త విడుదల తేదీని కూడా తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 23 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలియ జేస్తూ ఒక పోస్టర్ ని కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. 

పోస్టర్ లో సత్య దేవ్ , తమన్నా ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. సత్య దేవ్ , తమన్నా కాంబినేషన్ లో ఇది మొట్ట మొదటి సినిమా. కాల భైరవమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సత్య దేవ్మూవీ తో పాటు కృష్ణమ్మ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో సత్య దేవ్ ఒక కీలక పాత్రలో నటించాడు. తమన్నామూవీ తో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: