టాలీవుడ్ టాప్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ తొలినాళ్ల నుంచి మంచి విభిన్నమైన కథలతో ఫ్యామిలీ కథలతో పక్కా క్లాస్ చిత్రాలతో సినిమాలను తెరకెక్కిస్తూ ఆ సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకుంటున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ తారక్ ను కొత్తగా చూపించడంతో పాటు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమాను తెరకెక్కించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్షన్ సీక్వెన్స్ తో సూపర్ స్టార్ మహేష్  బాబు సినిమా షూట్ ను మొదలుపెట్టారని సమాచారం. అరవింద సమేత షూట్ ను ఏ విధంగా మొదలుపెట్టారో ఈ సినిమా షూట్ ను సైతం అదే విధంగా యాక్షన్ సీక్వెన్స్ తో త్రివిక్రమ్ మొదలుపెట్టారు. గత సినిమాలకు భిన్నమైన కథాంశంతో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ సీన్ జరుగుతోందని సమాచారం తెలుస్తుంది.అలాగే మరోవైపు గత సినిమాలను మించి ఈ సినిమా సక్సెస్ సాధించే విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.


అతడు, ఖలేజా సినిమాలలో ఖలేజా సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. త్రివిక్రమ్ అభిమానులను ఖలేజా సినిమా తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. అయితే మహేష్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం తెలుస్తోంది.అటు మహేష్ ఇటు త్రివిక్రమ్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఆ సినిమాను మించిన సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది. మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి చూడాలి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: