టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యకమైన గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నిత్యం ఈమె ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.అయితే ఈమె అనేకమైన తెలుగు సినిమాల్లో అక్క, వదిన, డాక్టర్ ఇలా హోమ్లీ రోల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది.ఇక ఈమె సినిమాల్లో మాత్రమే అంత పద్దతిగా కనిపిస్తూ ఉంటుంది... కానీ ఈమె బయట మాత్రం మోడ్రన్ మామ్ అన్నమాట....ఇకపోతే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం సురేఖా .. తన కూతురు సుప్రీతతో కలిసి మోడరన్ డ్రెస్సింగ్ స్టైల్, లివింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది.ఇదిలావుంటే ఇక సెలబ్రిటీగా సురేఖావాణికి, 

సుప్రీతకు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి.అంతేకాదు ఈమె  ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా ఫోటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరూ కలిసి రీల్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు.మోడ్రన్ మామ్ గా పేరు తెచ్చుకున్న సురేఖా.. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. ట్రోల్స్ వస్తూ పోతూ ఉంటాయని వాటిని  పట్టిచుకోకుండా తాను చేయాలనుకుంది చేస్తూనేఉంటుంది.. అంతేకాదు తన డ్రెస్సింగ్ స్టైల్ తో సురేఖా వయసు రోజురోజుకూ పెరుగుతుందా తగ్గుతుందా? అని అనుకునేలా చేస్తోంది.  అడపాదడపా తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది.

ఇదిలావుంటే  మరోవైపు సుప్రీత కూడా లేచింది మహిళా లోకం అనే సినిమాతో ఇండస్ట్రీ డెబ్యూ చేయనుంది.ఇదిలావుంటే ఇక సురేఖా కూతురు సుప్రీత.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు గ్లామర్ ట్రీట్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది.సుప్రీతను ఫాలో అయ్యే ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సుప్రీత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది. ఇక ఈ క్రమంలో డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతుంటారు నెటిజన్స్, ఫ్యాన్స్. అయితే తాజాగా ఓ నెటిజెన్.. సుప్రీతను పెళ్లి చేసుకుందామా? అని అడిగాడు. ఇక దీంతో వెంటనే స్పందించిన సుప్రీత.. “మా అమ్మకు చెప్తా.... నీ సంగతి చెప్తుంది. తర్వాత నాకు తెలీదు.... తెలిసినా నాకు సంబంధం లేదు భయ్యా” అని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం సుప్రీత ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: