తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న సుదీర్ బాబు తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా , ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకున్న krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కు కొంత మంది హీరోలు మరియు కొంత మంది దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక లో భాగంగా సుదీర్ బాబు మాట్లాడుతూ ... తన కెరీర్ లో మొత్తం మూడు మూవీ లు ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో చేయడం ఎంతో ఆనందంగా ఉంది అని ,  దాదాపుగా అన్ని జానర్స్ లో సినిమాలు చేసిన ఇంద్రగంటి గారు ఒక వికీపీడియా వంటి వారు అని ,  ఆయన దర్శకత్వంలో పని చేయడం ఒక పెయిడ్ హాలిడే కి వెళ్లినట్లుంటుందని ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుధీర్ బాబు చెప్పు కొచ్చాడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ తో సుధీర్ బాబు ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: