హీరోయిన్  పాయల్ రాజ్ పుత్ కెరియర్ లోనే RX -100 చిత్రమే ఒక బెస్ట్ చిత్రమని చెప్పవచ్చు.ఈ సినిమా వల్లే ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈమె ఎప్పుడూ కూడా బోల్డ్ కంటెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈమె నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్ గా ఉన్నాయి సజావుగానే నడుస్తూ ఉన్నది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచు విష్ణు సరసన జిన్నా అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. మరొకవైపు పంజాబీలో కూడా పలు సినిమాలలో నటిస్తే బిజీగా ఉన్నది.


హైదరాబాద్ నుండి చండీగర్ ప్రయాణంలో ఈ ముద్దుగుమ్మ చాలా బిజీగా తన సమయాన్ని గడిపేస్తోంది. అందుకోసం నిరంతరం విమానాశ్రయాలకు వెళుతూ ఉంటుంది. కానీ ఈసారి ప్రయాణం అంత సాఫీగా సాగలేదని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పాపులర్ ప్రైవేట్ జెట్ నిర్వాకానికి తన లగేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చాలా కోపంగా ఎయిర్ పోర్ట్ సిబ్బంది పైన ప్రవర్తిస్తోంది. తనతో  రూడ్ గా ప్రవర్తించారని తన లగేజ్ ని సరిగ్గా అందించలేదని ఆమె తెలియజేసింది  అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేయడం అవి చాలా వైరల్ గా మారుతున్నాయి.


విమానా సిబ్బంది ఇష్టానుసారంగా తన లగేజ్ని  విసిరేసారని ఆమె ఆవేదన చెందుతోంది. ఈ ప్రయాణం తనకు ఎన్నడూ జరగలేదని ఇలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని తెలియజేస్తుంది పాయల్. ఇక మంచు విష్ణు తో నటిస్తున్న జిన్నా చిత్రం టీజర్ కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది ఈ చిత్రంలో సన్నీలియోన్ కూడా కీలకమైన పాత్ర లో నటిస్తున్నది. ఈ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఈ ముద్దుగుమ్మల అందాల ఆరబోతూ ఉంటుందని టాక్ కూడా వినిపిస్తోంది. ఇందులో వెన్నెల కిషోర్ సునీల్ తదితరులు కూడా నటిస్తూ ఉన్నారు విచిత్రాన్ని సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: