టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు ఆయన విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటించగా ,  రమ్యకృష్ణ ఈ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించింది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది.

మూవీ పై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25 వ తేదీన లైగర్ మూవీ తెలుగు ,  తమిళ , హిందీ , మలయాళ , కన్నడ భాషలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే లైగర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగెటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలిపోయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన లైజర్ మూవీ గురించి స్పందించింది. రష్మిక మందన తాజాగా హిందీ సినిమా గుడ్ బై  నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా రష్మీక మందన 'లైగర్' మూవీ గురించి మాట్లాడుతూ గీతా గోవిందం ,  డియర్ కామ్రేడ్ మూవీ ల సందర్భంగా నేను విజయ్ దేవరకొండ స్నేహితులం అయ్యాం. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ నాకు బాగా నచ్చింది. మాస్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. లైగర్ మూవీ చూస్తూ విజిల్స్ వేసా ,  డాన్స్ చేశా. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నాకు నచ్చింది. విజయ్ దేవరకొండ అదరగొట్టేశాడు. వెల్డన్ విజయ్ అని ఆకాశానికి ఎత్తేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: