సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని రేంజ్ ని అక్కినేని ఫ్యామిలీ పై తీసుకొచ్చాడు అక్కినేని నాగేశ్వరరావు గారు.కాగా అక్కినేని వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన నాగార్జున కూడా ఆ ఇంటి పేరుకి ఎటువంటి కళంకం తీసుకోరాకుండా అక్కినేని ఇంటి పేరుని మరో స్థాయికి ఎక్కించారు.
ప్రజెంట్ ఇప్పుడు ఆ బాధ్యతలను తీసుకున్నాడు అఖిల్, నాగచైతన్య.

అయితే ఇప్పటివరకు వాళ్ళు ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వలేకపోయారు. సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయారు . అయితే కేవలం నాగచైతన్య అఖిలే కాదు అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలోకి సుశాంత్, సుమంత్ కూడా వచ్చారు . అయితే కెరియర్ మొదట్లో సుమంత్ సినిమా ఇండస్ట్రీలో పర్లేదు అనిపించినా.. రాను రాను ఆయన కెరియర్ గ్రాఫ్ డౌన్ అయిపోయింది . మరీ ముఖ్యంగా కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సినీ ఇండస్ట్రీలో సుమంత్ ని పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత అక్కినేని నాగార్జున పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సుశాంత్.. మొదటి సినిమాతో నే ఆయన సినిమా ఇండస్ట్రీకి పనికిరాడు అని ప్రూవ్ చేసుకున్నాడు .

నటన పరంగా జనాలను పెద్దగా మెప్పించలేకపోయాడు మొదటి సినిమా కాళిదాసు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. దీంతో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేశారు. ఫస్ట్ సినిమా ఇలా కావడంతో ట్రోలింగ్ చేయడంతో అక్కినేని హీరో తట్టుకోలేకపోయాడు. ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాడు అనే వార్తలు వచ్చాయి . అయితే ఈ వార్తను బయటికి రానివ్వకుండా అక్కినేని ఫ్యామిలీ అడ్డుపడిందని ఆ టైంలో నాగార్జున హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్ళిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అని వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ దీని గురించి దీనికి సంబంధించిన విషయాలను బయట పెట్టలేదు . అంతేకాదు ఇప్పటికీ ఆ హీరో సుశాంత్ ను హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదు సినీ ఇండస్ట్రీ. దీంతో అక్కినేని ఇంటి వారసుడిగా అలాంటి పేరు నిలబెట్టిన ఘనత నాగార్జునకే దక్కింది . మరి చూడాలి అఖిల్, నాగచైతన్య ఇద్దరిలో ఎవరు ఈ అక్కినేని పేరుని సినీ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ గా కొనసాగిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: