అపజయమే ఎరుగని దర్శకుడిగా రాజమౌళి చరిత్రకెక్కారు. రెండు దశాబ్దాల కెరీర్లో 12 చిత్రాలు మాత్రమే చేసిన రాజమౌళి ఎవరూ అందుకోలేని రికార్డ్స్ సెట్ చేశారు.బాహుబలి 2 విడుదలై ఐదేళ్లు అవుతున్నా ఆ మూవీ కలెక్షన్స్ టచ్ చేసే సినిమా రాలేదు. రాజమౌళి సినిమాల రికార్డ్స్ రాజమౌళినే బ్రేక్ చేసుకోవాలి. మరో దర్శకుడికి అది సాధ్యం కాదు. ఇక లేటెస్ట్ రిలీజ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో మరికొన్ని రికార్డ్స్ నమోదు చేశాడు. ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యూఎస్ లో ఈ మూవీ 14 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. సెలెక్టెడ్ థియేటర్స్ లో అక్కడ రీరిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.మరోవైపు ఆస్కార్ ఆశలతో ముందుకు వెళుతుంది. జనరల్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేశారు. 15 విభాగాల్లో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని పోటీకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి గురించి ఆయన చిత్రాలు సృష్టించిన రికార్డ్స్ గురించి ఎంత చెప్పినా తరగదు. అయితే రాజమౌళి కెరీర్ లో కూడా ప్లాప్ ఉన్న విషయం చాలా మందికి తెలియదు. అయితే దర్శకుడిగా కాదులెండి, నటుడిగా. రాజమౌళి పలు చిత్రాల్లో తళుక్కున మెరిసే పాత్రలు చేశారు.

రాజమౌళి దర్శకుడే కాదు మంచి నటుడు కూడా. తన సినిమాల్లో ప్రతి సన్నివేశాన్ని ఆయన నటులకు చేసి చూపుతాడు. నటించాలనే తన ఆశను చిన్న చిన్న క్యామియో రోల్స్ తో తీర్చుకుంటూ ఉంటాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సై ,మగధీర, బాహుబలి చిత్రాల్లో ఆయన నటించారు. అలాగే ఇతర దర్శకుల చిత్రాల్లో కూడా రాజమౌళి నటించడం జరిగింది. నాని హీరోగా నటించిన మజ్ను మూవీలో కనిపించారు.

 
Rajamouli

అయితే రాజమౌళి మొదటిగా నటించిన చిత్రం పిల్లనగ్రోవి. ఆ మూవీ విడుదల కాలేదు. తర్వాత రైన్ బో మూవీలో నటించారు. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. రాజమౌళి వెండితెరపై కనిపించిన మొదటి చిత్రం ఇదే కాగా దారుణ ఫలితం అందుకుంది. ఆ విధంగా రాజమౌళి కెరీర్లో కూడా ఓ డిజాస్టర్ ఉందన్న మాట. అయితే ఈ డిజాస్టర్ ఆయన ఖాతాలోకి రాదనుకోండి. నటించారు కాబట్టి చెప్పుకోవాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: