దాదాపు పదేళ్లుగా  పైగా రష్మీ గౌతమ్ ప్రయాణం జబర్దస్త్ తో సాగుతుంది. రష్మీ ఈ పొజిషన్ కి కారణం జబర్దస్త్. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ఆమె దశ తిరిగింది మరీ

స్టార్ యాంకర్ హోదా దక్కించుకుంది. ఆ ఫేమ్ హీరోయిన్ గా చాలా అవకాశాలు తెచ్చిపెట్టింది. నిజానికి రష్మి కెరీర్ మొదలైంది నటిగానే. హీరోయిన్ కావాలనే కలలతో హైదరాబాద్ వచ్చిన రేష్మీ హీరోయిన్ ఫ్రెండ్ వంటి చిన్న చిన్న అవకాశాలు మాత్రమే దక్కాయి. చాలా సినిమాల్లో రేష్మీ ఆ తరహా రోల్స్ చేస్తారు. ఇక హీరోయిన్ కావడం కలే అని తెలుసుకొని జబర్దస్త్ షోతో యాంకర్ అయ్యారు.

ఆ అవకాశం కూడా అనసూయ తప్పుకోవడం వలన వచ్చింది. జబర్దస్త్ ప్రారంభంలో అనసూయ యాంకర్ గా ఉండేది. వ్యక్తిగత కారణాలతో ఆమె జబర్దస్త్ వదిలేశారు. దాంతో రష్మీ కి జబర్దస్త్ యాంకర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. షోకి విపరీతమైన ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో ప్రారంభించారు. అప్పుడు అనసూయ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి జబర్దస్త్ యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత? వారు ఎపిసోడ్ కి ఎంత తీసుకుంటారు? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి.

దీనికి హైపర్ ఆది ఒక ఐడియా ఇచ్చాడు. లేటెస్ట్ జబర్దస్త్ ప్రోమో విడుదలైంది. ఒక స్కిట్ లో భాగంగా బుల్లెట్ భాస్కర్ టీమ్ ఒకవైపు-హైపర్ ఆది టీమ్ మరొక వైపు చేరి యుద్ధానికి దిగారు. యాంకర్ రష్మీ పై హైపర్ ఆది టీమ్ ఒక సెటైర్ వేయడంతో.. బుల్లెట్ భాస్కర్, ఇంత అవమానం తర్వాత కూడా ఇక్కడ నువ్వు ఉండొద్దు రష్మీ రా వెళ్ళిపోదాం . నా ఇంటికి వచ్చి నీ పేమెంట్ తీసుకెళ్ళు అన్నాడు. వెంటనే రెస్పాండ్ అయిన హైపర్ ఆది ఆమెకు పేమెంట్ ఇవ్వాలంటే నువ్వు వంద పెద్దమనిషి ఫంక్షన్స్ చేయాలి అన్నాడు మరి . రష్మీకి రెమ్యూనరేషన్ ఇచ్చేంత కెపాసిటీ నీకు లేదని హైపర్ ఆది పరోక్షంగా చెప్పారు

దీంతో రష్మీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే ఇంట్రెస్ట్ మరింత  ఆశక్తి కరంగా పెరిగింది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రష్మీ ఎపిసోడ్ కి రూ.1.8నుండి 2 లక్షలు తీసుకుంటారట. అంటే జబర్దస్త్ మేనేజ్మెంట్ ఆమెకు నెలకు రూ. 6 నుండి 8 లక్షలు ఇస్తారు. అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పాక రష్మినే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోస్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అంటే ఆమెకు డబుల్ రెమ్యూనరేషన్ దక్కుతుంది. ఒక్క జబర్దస్త్ ద్వారానే రష్మీ నెలకు దాదాపు రూ. 16 లక్షలు సంపాదిస్తుందన్నమాట మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి: