తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ మరియు ANR తర్వాత సూపర్ స్టార్స్ ఎవరు అంటే మన అందరికి టక్కున గుర్తుకు వచ్చే పేర్లు అయితే కృష్ణ మరియు శోభన్ బాబు..శోభన్ బాబు గారికి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ఈయన ఏర్పర్చుకున్న స్థానాన్ని ఇప్పటి ఎవ్వరు అందుకోలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆయన సృష్టించిన ప్రభంజనం ఎలాంటిది అనేది..శోభన్ బాబు గారు సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి చాలా కష్టాలే పడ్డాడట..ఆరంభం లో చిన్న చిన్న పాత్రలు కూడా వచ్చినా చేసాడు.


ఈరోజు ఆయన చనిపోయి 15 ఏళ్ళు దాటుతున్నా కూడా నేటి తరం ప్రేక్షకులు ఇంకా తన గురించి మాట్లాడుకునే స్థాయి స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్నాడు..శోభన్ బాబు గారిని అందరూ అప్పట్లో ముద్దుగా సోగ్గాడు అని పిలుచుకునే వారు..అయితే స్టార్ స్టేటస్ తో కొనసాగుతున్నప్పటికీ కూడా వయసు మీద పడుతుండడం తో తానూ సోగ్గాడిగానే నా అభిమానులకు కనపడాలి కానీ..నన్ను వృదుడిగా అభిమానులు చూడకూడదు అని సినిమాలు చెయ్యడమే మానేసాడట..


శోభన్ బాబు గారు సినిమాలు ఆపేసిన..ఆయన కుమారుడు లెగసీ ని కొనసాగిస్తాడని అప్పట్లో ఆయన అభిమానులు కూడా అనుకునేవారు..కానీ శోభన్ బాబు గారు తన కొడుకుని సినిమాల్లోకి తీసుకోచేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదట..ఎందుకంటే సినీ నటుడిగా శోభన్ బాబు గారు ఎదురుకొన్న ఒత్తిడి మామూలుది కాదు..సినిమా ఇండస్ట్రీ అంటే ఒక రంగుల ప్రపంచం..ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు..అదృష్టం బాగుంటే నాలాగా సక్సెస్ అయ్యి నిలదొక్కుకోగలరు..లేకపోతే కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది..నా కొడుకు జీవితాన్ని అలాంటి రిస్క్ తో కూడిన ఇండస్ట్రీ లో దింపి వాడిని కష్టాలపాలు చెయ్యడం నాకు ఇష్టం లేదని..వాడికి దేనిమీద ఆసక్తి ఉందొ నాకు బాగా తెలుసు..అందుకే వాడికి నచ్చిన దారిలో వెళ్లే స్వేచ్చని కల్పించాను..ఈరోజు వాడు గొప్ప స్థాయిలో కొనసాగుతున్నాడు అని అప్పట్లో శోభన్ బాబు గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడట.



శోభన్ బాబు గారి కొడుకు మరియు ఆయన కుటుంబం వ్యాపార రంగం లో ఉన్నత స్థాయిలో స్థిరపడి సంతోషం గా ఉన్నారట...కానీ శోభన్ బాబు గారి అభిమానులకు మాత్రం తమ అభిమాన హీరో లెగసీ శోభన్ బాబు తోనే ముగిసిపోయింది అనే అసంతృప్తి ఇప్పటికి వారిలో ఉందట .

మరింత సమాచారం తెలుసుకోండి: