తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తో ఈ యువ హీరో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లలో హీరోగా నటించిన ఈ యువ హీరో  హిట్ , అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరో గా నటించాడు. 

ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ఆ ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ మూవీ కి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటనను అధికారికంగా ప్రకటించింది. ఓరి దేవుడా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ను అక్టోబర్ 16 వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మంజీరా ఇంటర్నేషనల్ కాన్వెంక్షన్ సెంటర్ ,  సువిసే షపురం , గౌట్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ ,  రాజమండ్రి లో నిర్వహించనున్నట్లు ,  ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: