మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలు పెద్ద పండగలు అని చెప్పాలి.. ఈ పండుగలకు భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లను ఈ పండుగలకు ఫిక్స్ చేసుకుంటారట..


ఎందుకంటే పండుగ సీజన్ లో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ మోత మోగించడం అయితే ఖాయం.. అందుకే ఈ పండుగలనే టార్గెట్ చేసుకుని తమ సినిమాలను రిలీజ్ చేస్తుంటారు స్టార్స్.


అయితే ఉత్తరాది ప్రేక్షకులకు మాత్రం దీపావళి, రంజాన్ వంటి పండుగలనే ఎక్కువ టార్గెట్ చేస్తుంటారు.. కారణం ఈ సీజన్ లలో రిలీజ్ అయితే వందల కోట్లు వసూళ్లు చేయడమే కాకుండా కొత్త రికార్డులను కూడా నెలకొల్పుతాయి.. ఇది కొన్నేళ్లుగా ఉత్తరాదిన జరుగుతుంది. అయితే ఈసారి మాత్రం దీపావళి పండుగ కల ఏ మాత్రం కనిపించడం లేదు..


మరి ఈసారి ఎందుకు బాలీవుడ్ పట్టించు కోవడం లేదో తెలియడం లేదు కానీ ఈ సీజన్ ను మాత్రం కంప్లీట్ గా చేతులెత్తేసినట్టు కనిపిస్తుంది. గతంలో బాలీవుడ్ ఎంతో ఆర్బాటంగా సినిమాలను ప్రోమోట్ చేసేది. కానీ ఈసారి అక్షయ్ కుమార్ రామ్ సేతు సినిమాతో అజయ్ దేవగణ్ థాంక్ గాడ్ సినిమాతో రాబోతున్నారు. కానీ ఈ సినిమాల విషయంలో కొద్దిగా కూడా బజ్ అయితే లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మాత్రమే కాదు ఆ సినిమా మేకర్స్ విషయంలో కేసుల అంతగా ఆత్రుత, ఆసక్తి కనిపించడం లేదట... పెద్దగా ప్రొమోషన్స్ చేసేందుకు ఆసక్తి కూడా చూపించడం లేదు.. ఈ పండుగ సీజన్స్ లో ప్రొమోషన్స్ చేస్తే మంచి కలెక్షన్స్ రాబట్టడం ఖాయం.. కానీ మేకర్స్ మాత్రం సీరియస్ గా తీసుకోకుండా ప్రొమోషన్స్ మీద ఏ మాత్రం ద్రుష్టి పెట్టడం లేదు.. దీంతో ఓపెనింగ్స్ కూడా కష్టమే అంటూ తెల్చిపారేస్తున్నారట విశ్లేషకులు.. ఈ రెండు కేసుల డిజాస్టర్స్ అయితే కాంతారా కాసుల వర్షం కురిపించడం ఖాయమని పిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: