
ఈ ఇద్దరి కాంబినేషన్‌కు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు.. తమిళనాడు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
అంతేకాదు.. జయలలిత తో కలిసి ఎన్టీఆర్ నటించిన చిత్రాలను ఏడాది పాటు ప్రదర్శించిన థియేటర్లు కూడా తమిళనాట ఉన్నాయి. ఇలా.. తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ ఎన్టీఆర్-జయలలిత కాంబినేషన్ ఓ క్రేజ్‌సృష్టించింది. నిర్మాతలు అయితే.. ఒక దశలో ఈ ఇద్దరి కాంబినేషన్ కోసం.. ఏళ్ల తరబడి ఎదురు చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
"సావిత్రి మహానటి ఆ విషయంలో ఎక్కడా.. సందేహం లేదు. కానీ, ఒక దశలో కుర్రకారు ఆలోచనలు మారిపోయాయి. దీంతో సినిమాలపై ప్రభావం పడింది. అప్పటికి సావిత్రి బొద్దుగా మారారు. దీంతో జయలలితకు అవకాశాలు పుంజుకున్నాయి. రానురాను.. యువత క్రేజ్ అంతా.. జయలలితపైనే పడింది. దీంతో అన్నగారు.. జయలలిత కాంబినేషన్ మూవీ అంటే.. టికెట్లు కూడా దొరికేవి కావు" అని గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకొచ్చారు.
ఇలా.. తెలుగులోనే కాదు.. తమిళంలో అనేక సినిమాల్లో అన్నగారు నటించారు. తెలుగులో జయలలితతో వచ్చిన సినిమాలు 100 రోజులు ఆడితే.. తమిళంలో అయితే..ఏడాదిపైగానే ఆడి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. జయలలితతో సమానంగా అన్నగారిని.. తమిళనాడు ప్రజలు ఆదరించారు. అందుకే.. అన్నగారు.. తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చేందుకు చాలా రోజులు తటపటాయించారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
ఈ తరహా.. విజయం అందుకున్న ఇతర తెలుగు నటులు లేరనేది.. గుమ్మడి చెప్పిన మాట. అనేక వేదికలపై.. ఎన్టీఆర్‌కు.. జయలలితకు సంయుక్తంగా సత్కారాలు.. పూలాభిషేకాలు కూడా.. జరిగాయన్నారు. వీరి జోడీని తెరపై చూడాల్సిందేనని.. అంటారు.