దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ తో దర్శకుడు పూరి జగన్నాధ్ వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఇక కొందరు వ్యక్తుల నుండి తనకు, కుటుంబానికి ప్రాణహాని ఉందని పూరి జగన్నాధ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఇకపోతే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ లు డబ్బుల కోసం మానసిక వేదనకు గురి చేస్తున్నారు.ఇక  బెదిరింపులకు దిగుతున్నారని పూరి జగన్నాధ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.అంతేకాదు  నేను ముంబైలో ఉంటున్నాను. ఇక హైదరాబాద్ లోని నా నివాసంలో వృద్ధురాలైన అత్తగారు, 

భార్య, కూతురు మాత్రమే ఉన్నారు.అయితే  వాళ్లకు వరంగల్ శ్రీను హాని తలపెట్టే అవకాశంకలదంటూ కంప్లైంట్ ఇచ్చారు.ఇకపోతే లైగర్ మూవీని అధిక ధరలకు కొని వరంగల్ శ్రీను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.అయితే  అనూహ్యంగా డిజాస్టర్ టాక్ రావడంతో భారీగా నష్టాలు వచ్చాయి. ఇక దర్శక నిర్మాతగా ఉన్న పూరి జగన్నాధ్ నష్టాలు కొంత మేర పూడ్చాలని ఆయన కోరడం జరిగింది. అయితే ఈ మేరకు పూరి జగన్నాధ్ అంగీకరించారు కూడా. అంతేకాదు హామీ ఇచ్చి రెండు నెలలు అవుతున్నా పూరి జగన్నాధ్ డబ్బులు తిరిగి చెల్లించలేదు.ఇక దీంతో పూరి జగన్నాధ్ ఇంటి ముందు బయ్యర్లలతో ఆయన ధర్నాకు దిగనున్నట్లు ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అయితే దీనికి సమాధానంగా దర్శకుడు పూరి మాట్లాడిన ఒక ఆడియో ఫైల్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇక ఆ ఆడియో కాల్ లో పూరి జగన్నాధ్ ధర్నాకు దిగుతామన్న డిస్ట్రిబ్యూటర్స్ పై మండిపడ్డారు.కాగా డబ్బులు ఇస్తానని చెప్పినా ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే… ఇస్తానన్నది కూడా ఇవ్వబుద్ది కాదు, అన్నారు.ఇకపోతే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. కాగా ధర్నాలో ఉన్న వాళ్ళ పేర్లు లిస్ట్ అవుట్ చేసే వాళ్లకు ఇవ్వకుండా మిగతా వాళ్లకు డబ్బులు ఇస్తానంటూ ఆ ఆడియో ఫైల్ లో పూరి మాట్లాడాడు.ఇదిలావుంటే  తాజాగా డిస్ట్రిబ్యూటర్స్, ఫైనాన్సియర్స్ పై ప్రాణహాని ఉందంటూ పూరి జగన్నాధ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం సంచలనంగా మారింది.ఇక  ఆచార్య సినిమాతో దారుణంగా నష్టపోయిన వరంగల్ శ్రీనును లైగర్ కోలుకోలేని దెబ్బేసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: