తెలుగు బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ షోలలో ఎంతో మంది కమెడియన్లు తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది కమెడియన్స్ సైతం బుల్లితెర నుంచి వెండితెర మీదికి అడుగుపెట్టారు. అయితే తాజాగా జబర్దస్త్ నిర్వాహకులు ఆడిషన్స్ కోసం నిర్వహించగా.. అక్కడికి దాదాపుగా 3,000 మంది ఆడిషన్స్ కోసం వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. అందుకు సంబంధించి పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


యూట్యూబ్ ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించిన వారు కూడా జబర్దస్త్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక యూట్యూబ్ సెలబ్రెటీలు సోషల్ మీడియా సెలబ్రిటీలు సామాన్యులు ఇప్పటికే ఎంతోమంది సైతం జబర్దస్త్ ఆడిషన్స్ కు వచ్చినట్లుగా సమాచారం దీంతో నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన వారికి భోజనం ఏర్పాటు చేయాలని ముందుగా భావించారట కానీ చివరికి అంతమంది రావడంతో నిర్వాహకులు ఏం చేయాలో తెలియక కనీసం ఏర్పాట్లు కూడా చేయలేని పరిస్థితి ఉన్నట్లుగా సమాచారం.


దీంతో ఈటీవీకి ఉన్న పాపులారిటీ ఏ నేపథ్యంలో ఉందో దీన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతోంది. కొంతమంది టీం లీడర్లు తమకు పరిచయం ఉన్న వారి ద్వారా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మరి కొంతమంది ఆడిషన్స్ కు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చాలామంది అక్కడికి వచ్చారని చెప్పవచ్చు. వందల సంఖ్య నుంచి ఆడిషన్స్ కు వచ్చిన నేపథ్యంలో ఏం జరుగుతుందో అంటూ అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎంతమందికి జబర్దస్త్ లో నటించే అవకాశం కల్పిస్తుందో చూడాలి మరి. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కంటైన్స్ కావాల్సి ఉంది కాబట్టి అందులోకి కూడా తీసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: