భారతదేశ వ్యాప్తంగా అపూర్వ ఆదరణ సొంతం చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రస్తుతం జపాన్‌లో ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన అయితే లభిస్తున్నది.

భారతదేశ వ్యాప్తంగా అపూర్వ ఆదరణ సొంతం చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ప్రస్తుతం జపాన్‌లో ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. అక్కడ కూడా ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. వసూళ్లపరంగా కూడా సత్తా చాటుతున్నది. 'ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోవడం పట్ల చిత్ర దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని భావించానని, అయితే విదేశీయులు సైతం సినిమాలోని భావోద్వేగాలతో కనెక్ట్‌ అవుతున్నారని రాజమౌళి చెప్పారట.. రొమాంచితమైన పోరాట ఘట్టాలు, ధైర్యసాహసాలు మూర్తీభవించిన కథానాయకుల పాత్ర చిత్రణే సినిమా విజయానికి కారణమని రాజమౌళి వివరించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయానికి అద్భుతమైన హీరోయిజమే కారణమని భావిస్తున్నా. సార్వజనీనమైన అంశాలు ఉండటం వల్ల కథలోని భావోద్వేగాలతో విదేశీయులు కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు' అని రాజమౌళి కూడా వ్యాఖ్యానించారు. ఇటీవలే ఈ చిత్రం అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాటర్న్‌ అవార్డుల్లో బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ మూవీగా ఎంపికైంది. ఆస్కార్‌ బరిలో కూడా పోటీ పడనున్నట్లు ఇటీవలే చిత్రబృందం ప్రకటించిందట.

జపాన్‌లో 2.5కోట్ల వసూళ్లు
దీపావళి పర్వదినం సందర్భంగా జపాన్‌లో విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్కడి టాప్‌ పది చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన తొలి రెండు రోజుల్లోనే భారత కరెన్సీ ప్రకారం 2.5కోట్లు వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ ఎనలిస్ట్‌ రమేష్‌ బాలా కూడా తెలిపారు.

రాజమౌళి తన తరువాత సినిమాను మహేష్ తో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా చిన్న హింట్ కూడా ఇచ్చాడు రాజమౌళి.ఈ సినిమా ఒక అడ్వాంచేర్ లా ఉండబోతుందని సమాచారం. మరీ చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: