కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసింది. హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా ,  శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వల్ గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ లో అడవి శేషు హీరో గా నటిస్తూ ఉండగా , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని డిసెంబర్  2 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ ల స్పీడ్ ను వేగవంతం చేసింది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ ను నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్న వారికి సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ లను కూడా విడుదల చేసింది.

అందులో భాగంగా ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న మీనాక్షి చౌదరి ... ఆర్య పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రావు రమేష్మూవీ లో అడిషనల్ డీజీపీ నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కోమలి ప్రసాద్ ... వర్ష పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మాగంటి శ్రీనాథ్ ఈ మూవీ లో అభిలాష్ పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే హిట్ ది సెకండ్ కేస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: