టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు ఇప్పటికే అనేక విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే అడవి శేషు "మేజర్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం మేజర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన అడవి శేషు ఈ సంవత్సరం హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు హీరోగా నటించిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ,  మీనాక్షి చౌదరిమూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటించింది. 

మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేసింది. మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "ఊరికే ఊరికే" అనే వీడియో సాంగ్ విడుదల తేదీని ప్రకటించింది. ఊరికే ఊరికే వీడియో సాంగ్ ను నవంబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: