కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు రిషబ్ శెట్టి . అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన అతనీ క్రేజ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం పాకిపోయింది అని చెప్పాలి. కేవలం ఒక సాదాసీదా దర్శకుడిగా మాత్రమే ప్రస్తానాన్ని కొనసాగించిన రిషబ్ శెట్టి కాంతారా సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పాన్ ఇండియా దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఒక సాదాసీదా సినిమా ప్రస్తుతం రెండు వందల కోట్ల వసూళ్లు సాధించి ప్రస్తుతం 300కోట్ల వసూల్లు బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది అని చెప్పాలి.



 ఏకంగా నాచురాలిటీకి దగ్గరగా సినిమా తీసిన రిషబ్ శెట్టి ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉండడం కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇక తన కెరియర్ గురించి.. తాను తీసిన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు రిషబ్ శెట్టి. కాగా అందరిలాగానే తాను కూడా హీరో అవడం వెనక ఎన్నో కష్టాలు పడ్డాను అన్న విషయాన్ని ఒకానొక ఇంటర్వ్యూలో వెల్లడించాడు అని చెప్పాలి.


 తాను ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ఉద్యోగాలు చేసి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకెట్ మనీ కోసం ఇంట్లో తండ్రినీ డబ్బులు అడగలేక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడట రిషబ్ శెట్టి.. ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో సినిమాల్లోకి వెళ్లాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఇక తండ్రిని  డబ్బులు అడగలేక కూలి పనులకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి అంటూ గుర్తు చేసుకున్నాడు. డిగ్రీ పూర్తయ్యాక 2004 నుంచి 2014 వరకు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు బిజినెస్ చేశాను. హోటల్ బిజినెస్ లో కూడా పని చేసాను. ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డాను సినిమాలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే క్లాప్ బాయ్, స్పాట్ బై, అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశా. ఇక 2016లో తొలిసారి తుగ్లక్ అనే సినిమాలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. 2017లో రక్షిత్ శెట్టి తన సినిమా డైరెక్టర్ చేసే అవకాశం కల్పించారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: