రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి "వి ఎఫ్ ఎక్స్" పనులు అత్యధికంగా ఉండడం వల్ల ఈ మూవీ విడుదల చాలా కాలం ఆలస్యం అవుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రజల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ ఈ మూవీ యూనిట్ ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడం లేదు అని అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడం తో ఈ టీజర్ కు ఇప్పటికీ కూడా అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆది పురుష్ మూవీ హిందీ వర్షన్ టీజర్ అదిరిపోయే రేర్ రికార్డ్ ను యూట్యూబ్ లో సృష్టించింది. ఆది పురుష్ మూవీ హిందీ టీజర్ యూట్యూబ్ లో తాజాగా 100 మిలియన్ ల వ్యూస్ ను కంప్లీట్ చేసుకుంది. దీనితో యూట్యూబ్ లో 100 మిలియన్ ల వ్యూస్ ను సాధించిన రెండవ ఇండియన్ టీజర్ గా ఆది పురుష్ మూవీ హిందీ టీజర్ రికార్డ్ ను సృష్టించింది.  ఇలా ఆది పురుష్ మూవీ విడుదలకు ముందే అదిరిపోయే రికార్డ్ ను సాధించింది. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: