టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అంచుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించిన అడవి శేషు "క్షణం" మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో గా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని , టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఆ తరువాత గూఢచారి , ఎవరు తాజాగా విడుదల అయిన మేజర్ మూవీ లతో వరస విజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న అడవి శేషు  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. 

మూవీ లో మీనాక్షి చౌదరి , అడవి శేషు శాసన హీరోయిన్ గా నటించగా , శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా , ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఫర్స్ ఫిల్మ్  మరియు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: