తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది నిత్యామీనన్. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత ఎన్నో మంచి మంచి సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో అరుదుగా దొరికే హీరోయిన్లలో ఒకరిగా ఉన్న నిత్యామీనన్ అప్పట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం ఆమె కెరియర్ పై ఎంతో ప్రభావం చూపించింది అని చెప్పాలి.

ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ తనకు ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పి ఆయన అభిమానులు తాకిడికి గురైంది. అప్పటికే ప్రభాస్ ఎన్నో పెద్ద సినిమాలకు హీరోగా వ్యవహరించాడు. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి హీరోను తెలియదు అని చెప్పడం నిత్యామీనన్ మూర్ఖత్వం అని వారు అభివర్ణించారు. అంతేకాదు ఆయనను ఆమె అవమానించినట్లుగా ప్రభాస్ అభిమానులు భావించి ఆమెకు ఆయన సరసన సినిమాలు ఇవ్వకూడదు అని ప్రభాస్ కు విన్నవించుకున్నారు.

ఆ విధంగా ఆమె ప్రభాస్ తో ఎక్కువగా కలిసి సినిమాలో చేయలేదు అనే చెప్పాలి. ఎంత టాలెంట్ ఉన్నా కూడా నోరు అదుపులో పెట్టుకోకుంటే ఆ టాలెంట్ ఉన్న వ్యర్థమే అని చెప్పడానికి నిత్యమీనన్ సంఘటనే ఒక ఉదాహరణ. ఇప్పుడు ఆమెకు కొన్ని ప్రత్యేక పాత్రలు మాత్రమే వస్తున్నాయి ఫేమ్ తో పాటు బరువు కూడా పెరిగిపోవడంతో ఈమెకు ఎక్కువగా అవకాశాలు రావడం లేదని చెప్పాలి. ఇక ఆమె ఇటీవలే నటించిన సినిమా తిరు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా లో ఆమె మంచి పాత్ర పోషించింది అని చెప్పాలి. మొదటి నుంచి ఈ సినిమా లో ఆమె ఓ సైడ్ పాత్ర పోషించింది అని అందరు అనుకున్నారు. కానీ సినిమా చూశాక కనీ తెలియలేదు ఆమె హీరోయిన్ పాత్ర పోషించింది. కొంచెం లావుగా కనిపించినా అ పాత్ర కు ఆమె సరిగ్గా సూట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: