ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. అలా ఈ వారం తెలుగు బాషలో థియేటర్ లలో విడుదల కావడానికి రెడీ గా ఉన్న కొన్ని సినిమాల వివరాలను తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహించగా , ఆనంది ఈ మూవీ లో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.  ప్రదీప్ రంగనాథన్ హీరో గా తెరకెక్కిన లవ్ టుడే సినిమా నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో తెలుగు భాషలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా తమిళ భాషలో విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

వరుణ్ దావత్ హీరో గా కృతి సనన్ హీరోయిన్ గా తెరకెక్కిన తోడేలు సినిమా నవంబర్ 25 వ తేదీన హిందీ , తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీపై తెలుగు సినీ ప్రేమికుల మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఈ వారం తెలుగు భాషలో విడుదల కానున్న ఈ మూడు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: